విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? కేంద్ర హోమంత్రి సమాధానం చెప్పాలి: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:27 PM
నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ, జులై 28: నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు. వారిపై టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు.. అలాగే విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కేంద్రానికి ప్రియాంక గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉందని అన్నారు.
దేశ యువతను చూసి కేంద్రం భయపడుతోందని విమర్శించారు. విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందని ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు.
ఈ ఆందోళన చేసిన విద్యార్థులు తీవ్రవాదులు కాదు కదా? అంటూ కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏమిటని కేంద్రాన్ని నిలదీశారు. ప్రశ్నపత్రాల లీక్‌తో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ ఘటనలకు కారణమైన మాఫియాను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పేపర్ల లీక్‌ల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీక్‌లతో వేల మంది విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిందని ప్రియాంక గాంధీ ఆందోళన చెందారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి ఘన స్వాగతమా?: ప్రియాంక
152 సార్లు పేపర్ లీక్స్ జరిగాయని.. అయినా ఒక్కరిపైనా కూడా చర్యల్లేవని కాంగ్రెస్ ఎంపీ పెదవి విరిచారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో విద్యాశాఖ కేటాయింపులను తగ్గిస్తున్నారని విమర్శించారు. పదవికి రాజీనామా చేసిన మంత్రికి ఘనస్వాగతం పలకడం.. సిగ్గుపడేలా ఉందని అన్నారు.
ప్రధానికి అర్థం కావడం లేదు: ప్రియాంక
దేశంలో యువత ఏం కోరుకుంటోందో అర్ధం కావట్లేదని ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ చురకలంటించారు. మహిళలను అవమానించిన ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ కేటాయించారని ఆరోపించారు. దేశంలో పరీక్షా విధానం ఘోరంగా విఫలమైందని అన్నారు. మార్చుకోవాల్సింది కెమెరా యాంగిల్స్ కాదంటూ మోదీకి సూచించారు. తన మనసులోని యాంగిల్స్‌ను మార్చుకోవాలని మోదీకి స్పష్టం చేశారు. తన సలహాదారులను మార్చుకోవాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
For More National News And Telugu News