పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ABN , Publish Date - Jul 28 , 2026 | 02:34 PM
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చించారు.
న్యూఢిల్లీ, జులై 28: పేపర్ లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని జితేంద్ర సింగ్ అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మోదీ కృషి చేస్తున్నారని వివరించారు.
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆర్ఆర్‌బీ పేపర్ లీక్ అయ్యిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయని మండిపడ్డారు. అయితే పరీక్షల నిర్వహణలో సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. 2010లో NTA ఏర్పాటు విజ్ఞప్తిని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నీట్ పరీక్షా పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ల లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందుకోసం 2024 నాటి ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైపై మెరుగుల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అది పూర్తిగా కల్పితం.. వైరల్ రిజర్వేషన్ పోస్ట్‌పై శిల్పా శెట్టి స్పందన..
ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై చర్చ..
For More National News And Telugu News