అది పూర్తిగా కల్పితం.. వైరల్ రిజర్వేషన్ పోస్ట్‌పై శిల్పా శెట్టి స్పందన..
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:39 PM
రిజర్వేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారమవుతున్న ఓ స్క్రీన్ షాట్‌పై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పందించారు.
రిజర్వేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారమవుతున్న ఓ స్క్రీన్ షాట్‌పై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పందించారు. 'రిజర్వేషన్ ద్వారా ట్యాలెంట్ రాదు' అంటూ శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పోస్ట్ చేశారంటూ ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాను అలాంటి పోస్ట్ ఏదీ చేయలేదని తాజాగా శిల్ప స్పష్టం చేశారు (Shilpa Shetty reservation post).
వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్‌లో.. 'రిజర్వేషన్‌ను ముట్టుకోవద్దు. కానీ, జనరల్ కేటగిరీ వైద్యులు కేవలం జనరల్ కేటగిరీ రోగులకే చికిత్స చేయాలని, మిగతా డాక్టర్లు కేవలం తమ కులానికి చెందిన రోగులకే చికిత్స చేయాలని ఓ రూల్ పెట్టండి. ఇలా కొన్ని సంవత్సరాలు చేయండి. అప్పుడు ప్రజలే స్వయంగా కుల ఆధారిత రిజర్వేషన్‌ను రద్దు చేయమని అడగడం ప్రారంభిస్తారు. రిజర్వేషన్ ద్వారా నైపుణ్యం పొందలేరు' అనే వ్యాఖ్యలు కనిపించాయి. ఈ పోస్టు శిల్పా శెట్టి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టినట్లు ప్రచారం జరిగింది (Shilpa Shetty fake Instagram story).
ఈ వైరల్ స్క్రీన్‌షాట్‌పై శిల్పా శెట్టి స్పందించారు. 'ఈ నకిలీ పోస్ట్ చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఇది పూర్తిగా కల్పితం. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు' అని పేర్కొన్నారు (Shilpa Shetty clarification). అంతేకాకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ఆమె ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి స్క్రీన్‌షాట్‌ను నిజమని నమ్మకుండా, అధికారిక ఖాతాల ద్వారా ధ్రువీకరించుకోవాలని శిల్ప సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..