అది సాంకేతిక పొరపాటే.. ప్రధాని మోదీ వీడియోను బ్లాక్ చేయడంపై మెటా స్పందన..
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:50 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా స్పందించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా స్పందించింది. ఆ వీడియోను తొలగించడం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం (Technical Error) కారణంగానే ఈ ఘటన జరిగిందని మెటా స్పష్టం చేసింది. కాసేపటి తర్వాత వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది (Meta Modi video).
'ప్రధాని మోదీ వీడియో విషయంలో పొరపాటు జరిగింది. సమస్యను గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించాం. దీనికి చింతిస్తున్నాం' అని మెటా ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని వీడియో కనిపించకుండా పోయిన తర్వాత కాసేపు.. 'చట్టపరమైన అభ్యర్థన మేరకు పరిమితం అయింది' అనే సందేశం కనిపించింది. అయితే, అది కూడా సాంకేతిక లోపం వల్లే జరిగిందని మెటా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం వీడియోను పూర్తిగా పునరుద్ధరించామని, వినియోగదారులు యథావిధిగా వీక్షించవచ్చని సంస్థ తెలిపింది (PM Modi Facebook video).
కాగా, ఆ వీడియోలో ప్రధానమంత్రి మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు (Meta technical error). ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై తమ ప్రభుత్వ వైఖరిని వివరించారు. ఆ వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వీడియోను తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మెటాకు ఐటీ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. తాజాగా ఆ వీడియో తొలగింపుపై మెటా వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..