Share News

ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేటు జెట్.. పైలట్, కోపైలట్ మృతి

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:27 PM

ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన ప్రైవేటు జెట్.. పైలట్, కోపైలట్ మృతి
Private jet crashes

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో తొలుత చెట్టును ఢీకొని ఆ తర్వాత కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాప్తించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్టు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన సమయంలో అందులో ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.


జెట్ కుప్పకూలిన సమాచారం తెలిసిన వెటనే ఎస్ఎస్‌పీ లాల్ ఉమీద్ సింగ్ సహా సీనియర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రారంభానికి 24 గంటల ముందు..

అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

Updated Date - Apr 20 , 2026 | 05:42 PM