Share News

రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రారంభానికి 24 గంటల ముందు..

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:40 PM

పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రారంభానికి 24 గంటల ముందు..
Rajasthan Pachpadra refinery fire

జైపూర్, ఏప్రిల్ 20: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేపు (మంగళవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రిఫైనరీలో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


దేశంలోనే మొదటి రిఫైనరీ..

పచ్‌‌పద్ర రిఫైనరీకి 2013 సెప్టెంబర్ 22వ తేదీన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 37,230 కోట్ల రూపాయల వ్యయంతో రిఫైనరీ పనులు మొదలయ్యాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ 2018 జనవరి 16వ తేదీన ప్రాజెక్ట్ పనులను మరోసారి ప్రారంభించారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌‌‌ను చేపట్టాయి. భారతదేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇదే కావటం విశేషం.


ఇవి కూడా చదవండి

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 03:52 PM