ఎండల్లో జాగ్రత్త
ABN , Publish Date - May 28 , 2026 | 06:08 AM
దేశంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో బుధవారం...
ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు
న్యూఢిల్లీ, మే 27: దేశంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో బుధవారం వరుస పోస్టులు పెట్టారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు, వృద్ధులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఎండలకు తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపారు. ఎండలో ఎక్కువసేపు ఉంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం మనకు సవాలుగా మారిందని.. బయటికి వెళ్లినప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలని, ఎప్పటికప్పుడు నీరు తాగుతుండాలని, అవసరమైనవారికి గ్లాసుడు మంచినీళ్లు అందించాలని సూచించారు. ‘ఎండకు ప్రభావితమైనప్పుడు తలతిరగడం, వికారం, తీవ్రమైన అలసట తదితర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే చల్లని ప్రదేశంలోకి, లేదా నీడలోకి తరలించడం మంచిది. ఇలాంటి సందర్భాల్లో సత్వర చర్యలు అవసరం’ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News