Share News

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు.. పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు..

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:03 PM

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ పరిశీలనకు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఫార్సు చేశారు.

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు.. పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు..
President Droupadi Murmu

ఇంటర్నెట్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ పరిశీలనకు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఫార్సు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన శాసన ప్రక్రియలో ఇది కీలక ముందడుగుగా మారింది. నవంబరు 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి (President Droupadi Murmu).


రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) కింద రాష్ట్రపతి ఈ సిఫార్సు చేసినట్టు లోక్‌సభ సచివాలయం శనివారం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం కొన్ని కీలక బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించడానికి ముందు రాష్ట్రపతి సిఫార్సు అవసరం. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 550 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది (Delimitation Bill 2026).


అలాగే రాష్ట్రాల శాసనసభల్లో సభ్యుల గరిష్ఠ సంఖ్యను 500 నుంచి 650కి పెంచే ప్రతిపాదన కూడా ఉంది (Women's Reservation Bill). మొత్తం మీద పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో ప్రస్తుత స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలన్నది కేంద్రం ప్రణాళిక. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మహిళలకు రిజర్వ్ చేసే స్థానాలను గుర్తించి, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..


ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

Updated Date - Nov 28 , 2026 | 05:34 PM