ప్రకాశ్‌రాజ్ ఓటు తొలగించలేదు: ఈసీ
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:26 AM
తన ఓటును తొలగించారంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈసీ తరఫున అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్ ఓ ప్రకటన చేస్తూ..
బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తన ఓటును తొలగించారంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈసీ తరఫున అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్ ఓ ప్రకటన చేస్తూ... ఆయన ఓటును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చినట్లు, అది ఈసీ నిబంధనల మేరకే జరిగినట్లు పేర్కొన్నారు. ‘ప్రకాశ్‌రాజ్ శాంతినగర్‌లో ఓటరుగా ఉన్నారు. బీఎల్‌ఓ క్షేత్ర స్థాయి పరిశీలనలో ఓటరు జాబితాలో నమోదయిన రిజిస్టర్ నివాసం... ఇంటి నంబరు 266, గార్డెన్ అపార్ట్‌మెంట్ నుంచి ఆయన మరో ఇంటికి మారినట్లు గుర్తించాం. ప్రకాశ్‌రాజ్ నాలుగేళ్లుగా ఈ ఇంట్లో లేరని, మరొకరు అద్దెకు ఉంటున్నారని బీఎల్‌ఓ నిర్ధారించారు. అందుకే ఆయన పేరును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చాం. ప్రకాశ్‌రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ సమాచారం అందించాం. ఆయన శాంతినగర్‌లోనే మరో చోట నివసిస్తున్నట్లు తెలిపారు. స్థానిక బీఎల్‌వోను సంప్రదించి ఫారం-6 సమర్పించాలని సూచించాం. ఆయన పేరు శాంతినగర్ ఓటరు జాబితాలో ఉంటుంది’ అని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News