Share News

ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు.. ఫోరెన్సిక్ అనాలిసిస్‌లో బట్టబయలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:20 PM

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ టెస్టులో బయటపడింది. గత నెల 11న క్రైం బ్రాంచ్ అధికారులు సర్ ప్రైజ్ చెకప్ పేరుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును..

ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు.. ఫోరెన్సిక్ అనాలిసిస్‌లో బట్టబయలు

ఇంటర్‌నెట్ డెస్క్: జనతా దళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ టెస్టులో బయటపడింది. గత నెల 11న క్రైం బ్రాంచ్ అధికారులు సర్ ప్రైజ్ చెకప్ పేరుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. ఓ రేప్ కేసులో నిరుడు ప్రజ్వల్ దోషిగా తేలడంతో ఈ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అధికారులు జైలును తనిఖీ చేస్తున్న సమయంలో ప్రజ్వల్ తాను ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ వాడుతూ దొరికిపోయాడు. దీంతో అతని ఫోన్‌తో పాటు చార్జర్, ఓ పెన్ డ్రైవ్, నోట్ బుక్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్నట్లు, అలాగే పెన్ డ్రైవ్‌లో ఒక వెబ్ సిరీస్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు.


కాగా.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్‌కు ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో వీఐపీ కల్చర్‌ను ఈ ఘటన మరోసారి బట్టబయలు చేసిందని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. హాసన్ జిల్లాలో హొళెనర్సిపురలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఓ ఫాంహౌస్ లో 48 ఏండ్ల మహిళపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఆరోపణల కేసులో నిరుడు ప్రజ్వల్ దోషిగా తేలాడు. ఈ కేసులో అతను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో దోషికి ఫోన్ అందుబాటులోకి రావడంపై ఓ జైలు అధికారిపై ఉన్నతాధికారులు ఇదివరకే సస్పెన్షన్ విధించారు.


Also Read:

బ్రిక్స్ సదస్సు: దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస ద్వైపాక్షిక భేటీలు

పశ్చిమాసియా సంక్షోభంపై బ్రిక్స్ కీలక పాత్ర పోషించాలి: జిన్‌పింగ్

బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: మంత్రి సవిత..

Updated Date - Sep 12 , 2026 | 05:20 PM