Share News

పశ్చిమాసియా సంక్షోభంపై బ్రిక్స్ కీలక పాత్ర పోషించాలి: జిన్‌పింగ్

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:40 PM

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు బ్రిక్స్ దేశాలు ముందుండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

పశ్చిమాసియా సంక్షోభంపై బ్రిక్స్ కీలక పాత్ర పోషించాలి: జిన్‌పింగ్
Xi Jinping

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు బ్రిక్స్ దేశాలు ముందుండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు (Xi Jinping Middle East crisis).


'ప్రపంచంలో పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతల నేపథ్యంలో బ్రిక్స్ కూటమి మరింత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించేందుకు సమష్టి ప్రయత్నాలు చేయాలి. ప్రాంతీయ సంక్షోభాలను సైనిక మార్గాల కంటే చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారా పరిష్కరించేందుకు బ్రిక్స్ దేశాలు కృషి చేయాలని చైనా కోరుకుంటోంది' అని వ్యాఖ్యానించారు (BRICS peace efforts).


శాంతి, స్థిరత్వం, న్యాయం కోసం బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు (India BRICS Summit). కాగా, పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో సముద్ర మార్గాల భద్రత కూడా బ్రిక్స్ చర్చల్లో ప్రాధాన్యం పొందింది. నావికుల భద్రత కోసం బ్రిక్స్ దేశాల మధ్య అత్యవసర సహాయ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు.


ఇవి కూడా చదవండి..

అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..


భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు..

Updated Date - Sep 12 , 2026 | 04:45 PM