Share News

జైలులో తనిఖీలు.. అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ రేవణ్ణ.. ప్రభుత్వం సీరియస్

ABN , Publish Date - Aug 12 , 2026 | 10:06 AM

బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్బంగా జేడీ ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి అడ్డంగా దొరికిపోయారు.

జైలులో తనిఖీలు.. అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ రేవణ్ణ.. ప్రభుత్వం సీరియస్
Ex MP Prajwal Revanna

బెంగళూరు, ఆగస్టు 12: అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సెల్ ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్ లభ్యమైనాయని సెంట్రల్ క్రైమ్ అధికారులు వెల్లడించారు. అతడి వద్ద నుంచి నీలి రంగు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, ఛార్జర్‌తోపాటు డైరీని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బెంగళూరులోని పరప్పరన అగ్రహారం సెంట్రల్ జైలులో తమ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.


మరో వైపు ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. రేవణ్ణకు ఆ వస్తువులు ఎలా అందాయనే అంశంపై పూర్తి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జైలు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. సదరు జైలులో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్‌ అనుష్కు కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ జైలులో దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిగాయని జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రతాప్ రాయ్ అనే మరో ఖైదీ వద్ద కూడా మొబైల్ ఫోన్ లభ్యమైందని అన్నారు.


2019లో హసన్ ఎంపీ, జేడీ (ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ హోలినరసిపుర రూపల్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే రూ. 10 లక్షల జరిమానా విధించింది. 2025, ఆగస్టు 2వ తేదీన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. తనపై అతడు అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో కూడా తీశారంటూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం.. దర్యాప్తు ముమ్మరం

ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..

For More National News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 10:40 AM