Share News

బాలల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. నిందితులను పట్టుకున్న పోలీసులు..

ABN , Publish Date - Apr 20 , 2026 | 09:40 PM

అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. నవజాత శిశువులను లక్షల రూపాయలకు అమ్మే ఒక చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. నిందితులను పట్టుకున్న పోలీసులు..
child trafficking racket India

అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. నవజాత శిశువులను లక్షల రూపాయలకు అమ్మే ఒక చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 'ఆపరేషన్ దేవ్' పేరుతో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో నిర్వహించిన ఈ ఆపరేషన్ కీలక విషయాలను బయటపెట్టింది. (Child trafficking racket India).


గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఏప్రిల్ 6న దేవ్ అనే నాలుగేళ్ల బాలుడి అపహరణతో ఈ కేసు ప్రారంభమైంది. స్థానిక క్రైమ్ బ్రాంచ్ ఆ బాలుడిని విజయవంతంగా రక్షించి, ముగ్గురు స్థానిక అనుమానితులను అరెస్టు చేసింది. అయితే విచారణలో ఆ నెట్‌వర్క్ నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉందని బయటపడింది. సిండికేట్ సూత్రధారిని పట్టుకోవడానికి పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. సూత్రధారి బొడాషు నాగరాజు అలియాస్ మురుగన్‌ తెలంగాణలోని కాగజ్‌నగర్‌లో ఉన్నట్టు గుర్తించారు (Gujarat kidnapping case).


నిందితులు ఆన్‌లైన్ కమ్యూనికేషన్, డిజిటల్ ట్రాకింగ్ నుంచి తప్పించుకునే విధానాలు, గుర్తింపు మార్పులు వంటి పద్ధతులను వినియోగించినట్టు అధికారులు తెలిపారు (Police rescue child India). వీరు బలహీన కుటుంబాలకు చెందిన పిల్లలను కిడ్నాప్ చేసి.. సంతానం లేని దంపతులకు విక్రయించేవారు. ఒక్కో బిడ్డను రూ. 4 నుంచి 5 లక్షల వరకు అమ్మేవారు. ఇప్పటివరకు మొత్తం 8 మంది పిల్లలను వీరు అమ్మినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ పిల్లల్లో గుజరాత్, ముంబై నుంచి ఇద్దరేసి, హైదరాబాద్ నుంచి ముగ్గురు, ఢిల్లీ నుంచి ఒకరు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..


త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..

Updated Date - Apr 20 , 2026 | 09:41 PM