ఇది రీల్స్ యుగం..‘షార్ట్ కట్’లతో మోసపోవద్దు
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:28 AM
‘షార్ట్ కట్’తో మీ జీవితాలు ముగిసిపోతాయని యువతను ప్రధాని మోదీ హెచ్చరించారు. ప్రస్తుతం రీల్స్ యుగం నడుస్తోందని..షార్ట్ కట్ కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొన్ని దారులు...
కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ‘షార్ట్ కట్’తో మీ జీవితాలు ముగిసిపోతాయని యువతను ప్రధాని మోదీ హెచ్చరించారు. ప్రస్తుతం రీల్స్ యుగం నడుస్తోందని..షార్ట్ కట్ కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొన్ని దారులు చూపించవచ్చని.. అలాంటి అడ్డదారులతో అపాయమని స్పష్టంచేశారు. మీరు అభిమానించేవారి ఆత్మకథలు చదివితే ఎంతో ఉపయోగమని.. జీవితంలో ముందుకెళ్లడానికి ఇదొక్కటే షార్ట్ కట్ అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ అనే పుస్తకాన్ని ప్రధాని బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తర్వాత కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదని.. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ విధానంపై అధ్యయనం చేశారని.. ఇది అమల్లోకి వస్తే భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు. కోవింద్ మాట్లాడుతూ.. మోదీ సాధారణ కార్యకర్తలతో మమేకమవుతారని. ఆయనతో జరిపిన చర్చలు తనపై బలమైన ముద్ర వేశాయని తెలిపారు. కుటుంబం, వర్గం కంటే దేశమే మిన్న అని బీజేపీ భావిస్తుందని.. అందుకే ఆ పార్టీతో అనుబంధం పెంచుకున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News