Share News

పరస్పర సహకారంతో జలవివాదాల పరిష్కారం

ABN , Publish Date - May 29 , 2026 | 05:34 AM

అంతర్రాష్ట్ర జలవివాదాలను పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతిక పర్యవేక్షణ మొదలైనవాటి ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు...

పరస్పర సహకారంతో జలవివాదాల పరిష్కారం

  • రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ, మే 28: అంతర్రాష్ట్ర జలవివాదాలను పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతిక పర్యవేక్షణ మొదలైనవాటి ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. కరువుపీడిత బుందేల్‌ఖండ్‌కు నీరిచ్చేందుకు చేపట్టిన మధ్యప్రదేశ్‌లోని కెన్‌-యూపీలోని బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలని గురువారం ‘ఎక్స్‌’లో తెలిపారు. దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, జలసంరక్షణ, భూగ ర్భ జలాల రీచార్జ్‌, సమర్థ నీటిపారుదల సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. బుధవారం ఆయ న ఆధ్వర్యంలో 51వ ప్రగతి సమావేశం జరిగింది. ఇందులో 9 రాష్ట్రాల పరిధిలో చేపట్టిన రూ.30 వేల కోట్ల విలువైన రైల్వే, విద్యుత్‌, రోడ్ల ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టుల అమలులో ఆలస్యం జరిగితే ఖర్చులు పెరగడమే గాక.. పౌరులకు సకాలంలో అత్యవసర సేవలు అందకుండా పోతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాలువల వ్యవస్థను సరికొత్తగా వినియోగించుకోవాలన్నారు. కాలువల వెంబడి, వాటిపైన సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని.. హరిత ఇంధన ఉత్పత్తికి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. దీనివల్ల భూవినియోగాన్ని, నీటి ఆవిరి నష్టాలను తగ్గించుకోవచ్చని.. పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:34 AM