స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండియాదా.. ఐర్లాండ్‌దా!?
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:38 AM
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన కోటు జేబులో పెట్టుకున్న తిరంగా జేబు రుమాలుపై రాజకీయ సెటైర్లు పేలుతున్నాయి. భారత జాతీయ పతాకం రంగులతో...
ప్రధాని తన తిరంగా జేబు రుమాలును
తలకిందులుగా ధరించటంపై కాంగ్రెస్ ఎద్దేవా
న్యూఢిల్లీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన కోటు జేబులో పెట్టుకున్న తిరంగా జేబు రుమాలుపై రాజకీయ సెటైర్లు పేలుతున్నాయి. భారత జాతీయ పతాకం రంగులతో ఉన్న ఆ జేబు రుమాలును ఆయన తలకిందులుగా ధరించటమే అందుకు కారణం. మోదీ ధరించిన నెహ్రూ కోటులోని జేబు రుమాలులోని ఆకుపచ్చ రంగు పైన, కాషాయం రంగు కిందివైపు కనిపించాయి. ఈ పొరపాటుపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. స్వాతంత్య్ర దినోత్సవం భారతదేశానిదా? ఐర్లాండ్‌దా? అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. ‘నాయకుడు జాతీయ పతాకాన్ని ఉర్దూ పద్ధతిలో ధరించినట్లున్నారు. (సాధారణ భాషలకు భిన్నంగా ఉర్దూను కుడినుంచి ఎడమకు రాస్తారు). లేదంటే ఆయన భారత్‌కు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నారా!?’ అని శనివారం ట్వీట్ చేశారు. ఐర్లాండ్ జాతీయ పతాకంలో కూడా భారత పతాకంలాగే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అయితే, ఐర్లాండ్ పతాకంలో ఆకుపచ్చ రంగు ముందు ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News