Share News

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 14 , 2026 | 09:16 AM

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
B.R. Ambedkar 135th Birth Anniversary,

ఢిల్లీ: డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. న్యాయబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. దేశ నిర్మాణ దిశగా ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక న్యాయబద్ధమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు ఆయన జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి' అని ట్వీట్ చేశారు.


మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖలు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వివిధ రాష్ట్రాల ప్రముఖ నేతలు నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే అంబేడ్కర్ వాదులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయణ్ని గుర్తు చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌

నీ పిల్లివల్లే... మా పిల్లికి పిల్లలు

Updated Date - Apr 14 , 2026 | 09:42 AM