బీజేపీకి క్రెడిట్ ఇవ్వడానికి కొందరు సంకోచిస్తున్నారు: మోదీ
ABN , Publish Date - Nov 22 , 2026 | 09:48 PM
దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటాన్ని గుర్తించడానికి, ఆ ఘనతను బీజేపీకి ఇవ్వడానికి కొందరు ఇష్టపడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటాన్ని గుర్తించడానికి, ఆ ఘనతను బీజేపీకి ఇవ్వడానికి కొందరు ఇష్టపడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల దీపావళి స్నేహమిలన్ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. తమ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల వల్లే దేశంలో పేదరికం తగ్గిందని పేర్కొన్నారు (PM Narendra Modi speech).
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినవారు, జైళ్లలో గడిపినవారు ఇప్పుడు దేశంలో పేదరికం తగ్గడాన్ని చూసి సంతోషిస్తారని మోదీ అన్నారు. వెయ్యేళ్ల బానిసత్వం కారణంగా దేశం పేదరికంలోకి వెళ్లిందని, ఇప్పుడు 50 కోట్ల మంది ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. ఈ విజయాన్ని కొందరు బహిరంగంగా అంగీకరించడానికి వెనకాడుతున్నారని, ఎందుకంటే ఈ పరిణామం బీజేపీ హయాంలో జరగడం వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రయత్నాలు ఫలించాయనే సంతృప్తి తమకు ఉందన్నారు (50 Crore People Out of Poverty).
పేదలకు బ్యాంకు ఖాతాలు తెరవడం, వంటగ్యాస్ కనెక్షన్లు అందించడం, విద్యుత్ సదుపాయం కల్పించడం, ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను మోదీ ప్రస్తావించారు (India Poverty Reduction). అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా చేరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన గరీబ్ కల్యాణ్ మేళాల అనుభవం కేంద్రంలో సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడిందని తెలిపారు. పేదలకు కేవలం సహాయం అందించడం మాత్రమే కాకుండా, వారు పేదరికం నుంచి బయటపడేందుకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..