Share News

ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్.. యువ అథ్లెట్లతో ప్రధాని వర్చువల్ ఇంటరాక్షన్

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:54 PM

దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యువతనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్.. యువ అథ్లెట్లతో ప్రధాని వర్చువల్ ఇంటరాక్షన్
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు(గురువారం)నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్(డైలాగ్) కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్స్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా సంభాషించారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలంటే కేవలం మెడల్స్ కాదని.. యువతలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపే సాధనాలనీ మోదీ చెప్పుకొచ్చారు. ఆటలు యువశక్తిని వెలికితీస్తాయన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి యువశక్తితో పాటు క్రీడాసక్తి కూడా ఎంతో అవసరమని మోదీ పేర్కొన్నారు.


ఒలింపిక్స్‌లో భారత్ తగిన ప్రాతినిథ్యం వహించట్లేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. దేశం క్రీడలపై ఎక్కువగా ఆసక్తి చూపడంలేదన్నారు. 2012లో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్.. 12 ఆటల్లో మాత్రమే మెడల్స్ సాధించిందని తెలిపారు. సర్ఫింగ్‌ వంటి ఆటల్లో మన క్రీడాకారులు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. దేశంలో ప్రతిభకు లోటు లేదని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల వారిలో టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో పథకాలను సాధించాలని ఆయన కోరారు. ఇందుకోసం ప్రభుత్వం.. క్రీడాకారులు, అథ్లెట్లకు సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ

డిసెంబర్‌లో జరిగే ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ పోటీలను నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి...

ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికను వివస్త్రగా మార్చి..

ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌.. ఆ సొత్తు మూలాలపై ఆరా

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 03:10 PM