Share News

చిన్మయానంద ఏఐ రూపంతో ప్రధాని మోదీ సంభాషణ

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:20 AM

చిన్మయ మిషన్‌ 75 ఏళ్ల ఆధ్మాత్మిక ప్రస్థానాన్ని పురస్కరించుకొని చిన్మయ అమృత్‌ మహోత్సవ్‌ గ్లోబల్‌ సమ్మేళన్‌ నిర్వహిస్తున్నారు

చిన్మయానంద ఏఐ రూపంతో ప్రధాని మోదీ సంభాషణ
modi

న్యూఢిల్లీ, అక్టోబరు 24: చిన్మయ మిషన్‌ 75 ఏళ్ల ఆధ్మాత్మిక ప్రస్థానాన్ని పురస్కరించుకొని చిన్మయ అమృత్‌ మహోత్సవ్‌ గ్లోబల్‌ సమ్మేళన్‌ నిర్వహిస్తున్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్మయ మిషన్‌ వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద ఏఐ ఆధారిత త్రిడీ హోలో గ్రాఫిక్‌ రూపంతో మోదీ సంభాషించారు. స్వామి చిన్మయానందను గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని మోదీ 1993లో స్వయంగా కలిశారు. ఆ తర్వాత కొంతకాలానికి చిన్మయానంద మరణించారు. శుక్రవారం నాటి సంభాషణలో మోదీ ఆ సమావేశాన్ని గుర్తు చేసుకోగా.. మాట కలిపిన చిన్మయానంద నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు సభికుల అందరూ ఆశ్చర్యపోయారు. 1993లో తాను కలిసిన వ్యక్తి ఈ రోజు ప్రధానిగా దేశానికి సేవలందించడం ఆనందం ఉందన్న స్వామి చిన్మయానంద.. ‘‘నరేందర్‌.. దేశం మీకు అండగా ఉంది’’ అంటూ ఆశీర్వదించారు.

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 06:03 AM