Share News

ఇండోనేషియాలో మోదీకి అపూర్వ స్వాగతం

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:05 AM

ఆగ్నేయాసియా దేశాలతో (యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ) సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (మహాసాగర్‌ విజన్‌) మరింత...

ఇండోనేషియాలో మోదీకి అపూర్వ స్వాగతం

న్యూఢిల్లీ, జూలై 6: ఆగ్నేయాసియా దేశాలతో (యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ) సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (మహాసాగర్‌ విజన్‌) మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనను సోమవారం ఇండోనేషియాతో ప్రారంభించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా జకార్తా విమానాశ్రయానికి విచ్చేసి మోదీకి ఘనస్వాగతం పలికారు. అంతకుముందు మోదీ విమానం ఇండోనేషియా గగనతలంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి, జకార్తాలో ల్యాండ్‌ అయ్యేంత వరకు రెండు యుద్ధ విమానాలతో (ఎఫ్‌-16, సుఖోయ్‌30) ప్రత్యేక రక్షణ కల్పించారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ శతాబ్దాల నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన హిందూ ఆలయం ‘ప్రంబనన్‌’ను అధ్యక్షుడు సుబియాంతోతో కలసి మోదీ సందర్శిస్తారు. ఇండోనేషియా నుంచి ప్రధాని మోదీ ఈ నెల 8న ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. చివరిగా ఈ నెల 10 నుంచి రెండు రోజులపాటు న్యూజిలాండ్‌ను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీ్‌సతో, న్యూజిలాండ్‌ దేశాధ్యక్షుడు క్రిస్టోఫర్‌తో మోదీ ఈ పర్యటనలో చర్చించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:05 AM