చిప్స్ నుంచి షిప్స్ వరకు.. భారత్-దక్షిణ కొరియా సంబంధాలు కొత్త దశలోకి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:55 PM
భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి.
భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది కీలక ముందడుగు అని అన్నారు (Modi South Korea ties).
భారత్, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా టెక్నాలజీ, రక్షణ, షిప్ బిల్డింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో విస్తరిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకు.. ఇలా వివిధ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం చేసుకుంటున్నట్టు తెలిపారు (India Korea trade news).
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సుమారు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని తెలిపారు (Modi Lee Jae Myung meeting). ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు (MoUs) కూడా కుదిరాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, టెక్నాలజీ, ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని మోదీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..
త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..