ఆ పిల్లల్ని క్షమిస్తున్నా
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:53 AM
ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా వారిని క్షమిస్తున్నానని...
నన్నే కాదు.. నా తల్లినీ దూషించారు
అయినా.. వారిని కోర్టుల చుట్టూ
తిప్పడం, శిక్షించడం అవసరం లేదు
తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి
దేశంతోపాటు ముందడుగు వేయాలి
ప్రధాని మోదీ వీడియో సందేశం
న్యూఢిల్లీ, జూలై 31: ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా వారిని క్షమిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలని, వారి ఉజ్వల భవిష్యత్తును తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా వీడియోలు విడుదల చేస్తున్న ప్రధాని.. శుక్రవారం రాత్రి వేళ మరో వీడియో సందేశం వినిపించారు. జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా కొందరు తన మీదేగాక, స్వర్గస్థురాలైన తన తల్లి మీద కూడా బూతులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, చిన్నతనంలో తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని, బాల్యం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. ‘సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది కల్చరల్ షాక్ వంటిది. కానీ, వీళ్లంతా మన పిల్లలు. వీళ్లను కోర్టుల చుట్టూ తిప్పించటం, శిక్షించటం వంటి వాటి వల్ల సమాజంలోని పరిస్థితులను మార్చలేం. కాబట్టే, నేను వాళ్లను క్షమించాలనుకుంటున్నా. దీనిని సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిల్లలకు నేను పిలుపునిస్తున్నా.. రండి.. అందరం కలిసి దేశం కోసం పని చేద్దాం. దేశం ముందుకు వెళ్తోంది. మీరు కూడా ముందడుగు వేయాలి’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News