ఐదేళ్లలో ఐదింతలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:22 AM
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 2021 నుంచి 2025 మధ్యకాలంలో ఐదు రెట్లు పెరిగింది. 2021లో రూ.36 కోట్లుగా ఉన్న వార్షిక బిల్లు...
రూ.36 కోట్ల నుంచి 180 కోట్లకు చేరిన ప్రధాని
విదేశీ టూర్ల వార్షిక వ్యయం 2021-25 మధ్య 550 కోట్లు
ఈ ఏడాది ఇప్పటివరకు 74.58 కోట్లు దాటిన బిల్లు
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 2021 నుంచి 2025 మధ్యకాలంలో ఐదు రెట్లు పెరిగింది. 2021లో రూ.36 కోట్లుగా ఉన్న వార్షిక బిల్లు.. 2025 నాటికి రూ.180కోట్లకు పైగా చేరింది. 2021 నుంచి ఇప్పటి వరకు ప్రధాని విదేశీ టూర్ల కోసం రూ. 550 కోట్లకు పైగా ఖర్చయినట్లు కేంద్రం పేర్కొంది. గురువారం రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఆయా పర్యటనలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2021లో రూ.36కోట్లుగా ఉన్న వ్యయం.. 2022లో రూ.55కోట్లకు.. 2023లో రూ.93 కోట్లకు ఎగబాకింది. 2024లో రూ. 109కోట్లు కాగా, 2025లో రూ.180 కోట్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.74.58 కోట్లు ఖర్చు కాగా.. జూన్‌లో చేపట్టిన ఫ్రాన్స్ పర్యటన బిల్లుల లెక్కింపు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా గత మే నెలలో వెళ్లిన నార్వే పర్యటన అతి ఖరీదైనదిగా నిలిచింది. ఈ ఒక్క యాత్రకే అత్యధికంగా రూ. 17.46 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News