రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:42 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రైస్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి-పుణె, అయోధ్య-ముంబై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పచ్చజెండా ఊపారు.
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్తగా రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రైస్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి-పుణె, అయోధ్య-ముంబై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పచ్చజెండా ఊపారు. అయోధ్య-ముంబై రైలుతో శ్రీరామ మందిర్ తీర్థ్ క్షేత్ర్‌కు అనుసంధాన మరింత మెరుగవుతుంది. రూ.6,350 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
'నారీ శక్తి వందన్-వికాస్‌కు ఈ రోజు ఒక పండుగ. కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడి నుంచి శంకుస్థాపనలు చేశాం. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రారంభించాం. కాశీ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నారు. కాశీ, అయోధ్య మధ్య కనెక్టిటివీ పెంచే పనులు కూడా ఉన్నాయి. కొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించాం. కాశీ నుంచి పుణె, అయోధ్య నుంచి ముంబైకి ఈ రైళ్లు ప్రయాణం సాగిస్తాయి. తద్వారా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీ కూడా మరింత మెరుగవుతుంది. ముంబై, పుణే సహా మహారాష్ట్రకు చెందిన వారంతా అయోధ్య థామ్, కాశీ విశ్వనాథ్ థామ్ వెళ్లేందుకు మరో మోడ్రన్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాం' అని మోదీ అన్నారు.
మీ ఆశీస్సుల కోసమే వచ్చా
దేశ సంక్షేమం కోసం చేపడుతున్న ఈ మహాయజ్ఞంలో ఆడపడుచుల ఆశీస్సులు పొందేందుకే తాను ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు. కాశీ ఎంపీగా, దేశ ప్రధానిగా ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నానని అన్నారు. లోక్‌సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని, అయితే కొద్ది రోజుల క్రితం తమ ప్రయత్నాలు సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ వల్ల విజయవంతం కాలేదని అన్నారు. అయితే మహిళలకు రిజర్వేషన్ హక్కులు దక్కేంతవరకూ తాము వెనుకాడేది లేదని లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మహిళలను మరోసారి వంచించాయని, 40 ఏళ్లుగా మహిళలకు రిజర్వేషన్ హక్కులను దక్కకుండా బ్రేక్‌లు వేస్తున్నాయని విమర్శించారు. ఆనువంశిక పార్టీలు దేశ ఆడపడుచులను అసెంబ్లీకి, లోక్‌సభకు చేరనీయడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్
శబరిమల కేసులో కీలక మలుపు.. సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు