మీ పాలన అద్భుతంగా సాగాలి..
ABN , Publish Date - May 11 , 2026 | 06:36 AM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆయన పాలన అద్భుతంగా..
విజయ్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ, మే 10: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆయన పాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఒక కొత్త తరాన్ని, కొత్త స్వరాన్ని, ఒక కొత్త ఆలోచనను ఎన్నుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాహుల్.. ఆ చిత్రాలను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు సీఎం రేవంత్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పదవీకాలం విజయంతంగా సాగాలన్నారు. ఇదిలా ఉండగా, విజయ్‌కు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రస్తావించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News