Share News

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 26 , 2026 | 10:21 AM

యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు.

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. దాడిని ఖండించిన ప్రధాని మోదీ
Modi condemns attack

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అమెరికాలో యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్‌లో ఇటీవల జరిగిన భద్రతా పరమైన ప్రమాదం నుంచి అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని ఊరట చెందాను. వారు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిందే’ అని రాసుకొచ్చారు.


అమెరికా రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నాం: ట్రంప్

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు జరిగిన 2 గంటల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘షూటర్‌ను అదుపులోకి తీసుకున్నాం. పవర్‌ఫుల్ గన్‌తో షూటర్ కాల్పులు జరిపాడు. ఘటనలో ఓ అధికారికి గాయాలయ్యాయి. నిందితుడి దగ్గర చాలా ఆయుధాలున్నట్టు గుర్తించాం. నిందితుడు కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి. దీన్ని అమెరికా రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నాం. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించారు. సీఐఏ ఏజెంట్స్, పోలీసులు అద్భుతంగా పని చేశారు. ఏజెంట్లు చాలా వేగంగా, ధైర్యంగా పనిచేశారు. సీక్రెట్ సర్వీసెస్ సిబ్బందికి ధన్యవాదాలు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రోడ్డు మధ్యలో భూగర్భ నీటి ట్యాంకులు

ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..

Updated Date - Apr 26 , 2026 | 10:26 AM