Share News

తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదు.. వకుళాభరణంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:51 AM

తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్‌లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో మోదీ మాట్లాడుతూ..

తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదు.. వకుళాభరణంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్‌లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో మోదీ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధాని దేవెగౌడ 93 ఏళ్ల వయసులో రైతుల ప్రయోజనం కోసం రంగంలోకి దిగి నిరసన తెలిపారు. పోరాటం అంటే అదే. మన తెలంగాణ నేతలకు అంత ఉద్యమస్ఫూర్తి లేదు’’ అని పేర్కొన్నట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి అసాధ్యుడని, తనతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర బీజేపీ నేతలను కూడా మాయ చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ ఎంతో పుంజుకోవాల్సి ఉందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది.


కేంద్ర పథకాలపై ప్రచారం అవసరం..

తాను రచించిన అంత్యోదయం నుంచి వికసిత్‌ భారత్‌, నరేంద్రమోదీ-భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు, జీఎస్టీ-సామాజిక న్యాయం తదితర పుస్తకాలను మోదీ మెచ్చుకున్నారని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు చెప్పారు. తన పాలనపై ఇలాంటి పుస్తకాలను బీజేపీలోని సీనియర్‌ నేతలు ప్రచారంలోకి తేవాలన్నారని వివరించారు. ఓబీసీల కోసం ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ నేతలు తెలంగాణలో ప్రచారం చేయాల్సి ఉందని మోదీ చెప్పారని తెలిపారు.


ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 08:14 AM