Share News

కాంగ్రెస్‌ పరాన్నజీవి

ABN , Publish Date - May 11 , 2026 | 06:05 AM

కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేయడం మాత్రమే తెలుసని, దశాబ్దాలుగా తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ విమర్శించారు. నేడు ఆ పార్టీ...

కాంగ్రెస్‌ పరాన్నజీవి

ఆ పార్టీకి ద్రోహం చేయడం మాత్రమే తెలుసు

  • మిత్రపక్షం డీఎంకేకు వెన్నుపోటు పొడిచింది

  • బెంగళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా

బెంగళూరు, మే 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేయడం మాత్రమే తెలుసని, దశాబ్దాలుగా తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ విమర్శించారు. నేడు ఆ పార్టీ ఒక పరాన్నజీవిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. బెంగళూరు పర్యటనలో భాగంగా హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం ప్రాంగణంలో ఆదివారం ఉదయం అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ అంటేనే ద్రోహం, అవినీతి అన్నారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్‌ నేతల అంతర్గత పోరాటల కారణంగా ప్రజలకు సుపరిపాలన అందడం లేదని మోదీ విమర్శించారు. ఇక్కడ సీఎం, డీసీఎం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని, సీఎం కుర్చీలోకి వెళ్లాలనే ప్రయత్నాలు మినహా ప్రజా సంక్షేమం వారికి పట్టదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రాజకీయ స్థిరత్వానికి, అభివృద్ధికి ప్రతిరూపంగా మోదీ అభివర్ణించారు. మోదీ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం శివకుమార్‌ స్పందించారు. కర్ణాటకలో ఏ కుర్చీ కూడా కదలడం లేదని, అన్ని కుర్చీలూ గట్టిగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం ఎంతకాలం ఉంటారో తెలియడం లేదని, కుర్చీకోసం పోరాటంసాగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి డీకే స్పందిస్తూ, ప్రధానమంత్రికి ఏం కనిపించిందో తనకు తెలియదని, కానీ రాష్ట్రంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందని అన్నారు.

ప్రధాని పర్యటన మార్గంలో జిలెటిన్‌ స్టిక్స్‌ కలకలం

బెంగళూరులో ప్రధాని మోదీ ప్రయాణించే మార్గంలో జిలెటిన్‌ స్టిక్స్‌ లభ్యం కావడం కలకలం రేపింది. కనకపుర రోడ్డులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌వైపు వెళ్లే మార్గంలో ఆదివారం ఉదయం ఈ పేలుడు పదార్థాలను గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలీసులు కోరమంగలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ వ్యక్తి కోరమంగల పోలీసులకు ఫోన్‌ చేసి హెచ్‌ఏఎల్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వద్ద పేలుళ్లు జరుపుతామని హెచ్చరించాడు. తనిఖీల్లో హెచ్‌ఏఎల్‌ వద్ద కాకుండా తాతగుణి వద్ద రోడ్డుకు 40-50 మీటర్ల దూరంలో జిలెటిన్‌ స్టిక్స్‌ దొరికాయి. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌ వెళ్లాల్సిన కార్యక్రమం ఆలస్యమైనట్టు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:05 AM