రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు జమ
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:42 PM
పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి.
కోల్‌కతా/తారకేశ్వర్, జూన్ 20: పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 2.18 కోట్ల మంది మహిళా రైతులు లబ్ధి పొందడం విశేషం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు అందిన మొత్తం సాయం రూ. 4.46 లక్షల కోట్లు దాటింది.
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ (PM-KISAN) యోజన 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో పాటు, పశ్చిమ బెంగాల్ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ పలు కీలక పథకాలను, డిజిటల్ విప్లవాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు