Share News

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాని ఊతం.. రూ.1,86,405 కోట్ల నిధులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:54 PM

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'పీఎమ్ ధార'పథకానికి ఆమోదం తెలిపింది.

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాని ఊతం..  రూ.1,86,405 కోట్ల నిధులు
Cabinet Approves PM DHARA Scheme With Rs 1.86 Lakh Crore Outlay

ఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'పీఎమ్ ధార'పథకానికి ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ.1,86,405 కోట్ల నిధులు కేటాయించారు.

సోలార్ లేదా విండ్ ప్లాంట్లు సాధారణంగా నగరాలకు దూరంగా (ఎడారులు లేదా మైదాన ప్రాంతాల్లో) ఉంటాయి. అక్కడ తయారైన కరెంట్‌ని అక్కడే ఉంచలేం. దాన్ని మన ఇళ్లకు, పరిశ్రమలకు చేర్చాలంటే భారీ ట్రాన్స్‌మిషన్ లైన్లు (విద్యుత్ తీగలు), సబ్-స్టేషన్లు, గ్రిడ్ వ్యవస్థ కావాలి. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌లోకి సురక్షితంగా తరలించడాన్ని 'పవర్ ఎవాక్యుయేషన్' అంటారు. ఇందుకోసం భారీ విద్యుత్ లైన్లు, గ్రిడ్‌లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను దేశవ్యాప్తంగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తుంది.


వ్యవసాయం, పట్టణ రవాణా రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర మంత్రి మండలి రూ.2,79,157 కోట్ల (సుమారు రూ.2.79 లక్షల కోట్లు) విలువైన మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.


రబీ పంటలకు సవరించిన మద్దతు ధరలు (Rabi MSP 2027-28)

రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కి గానూ ఆరు ప్రధాన రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రైతులకు దాదాపు రూ. 90,962 కోట్ల లబ్ధి చేకూరనుంది.

పంటల వారీగా కొత్త MSP ధరలు (క్వింటాలుకు)

  • గోధుమలు (Wheat): రూ.2,610 (గతంలో రూ.2,585 — రూ.25 పెంపు)

  • బార్లీ (Barley): రూ.2,286 (రూ.136 పెంపు)

  • శనగలు (Gram): రూ.5,958 (రూ.83 పెంపు)

  • మసూర్ పప్పు (Lentil): రూ.7,390 (రూ.390 పెంపు)

  • ఆవాలు/రైప్ సీడ్ (Mustard): రూ.6,613 (రూ.413 పెంపు)

  • కుసుమలు (Safflower): రూ.7,215 (అత్యధికంగా రూ.675 పెంపు)


తృణధాన్యాల కంటే నూనెగింజలు, పప్పుధాన్యాలకు ఎక్కువ మద్దతు ధరలు ప్రకటించి రైతులకు పంట మార్పిడి (Crop Diversification) వైపు ప్రోత్సాహం అందించడం ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం.

'పీఎమ్ ధార' (PM DHARA) – రూ.1,86,405 కోట్లు

దేశంలో పునరుత్పాదక ఇంధన వ్యాప్తిని వేగవంతం చేసేందుకు PM DHARA (Developing Harmonized and Accelerated Renewable Energy Access) పథకానికి కేబినెట్ రూ.1,86,405 కోట్లు కేటాయించింది.

గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC-III) ద్వారా 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు అనుసంధానించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా 50 GWh సామర్థ్యంగల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం.

ఢిల్లీ ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ (ITMS) – రూ.1,790 కోట్లు

దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కోసం రూ. 1,790 కోట్లు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ సిగ్నల్స్ ద్వారా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రవాణా రద్దీని తగ్గించి రోడ్డు భద్రతను పెంచనున్నారు.


ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Sep 30 , 2026 | 04:27 PM