Share News

రష్యా చమురుకు బ్రేక్‌!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:03 AM

రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు డిస్కౌంట్లు కూడా భారీగా తగ్గడంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్ణయించింది.

రష్యా చమురుకు బ్రేక్‌!
russiafuel tankers

  • రవాణా, బీమా ఖర్చులు పెరగడంతో

  • కొనుగోళ్లు తగ్గించాలని బీపీసీఎల్‌ నిర్ణయం

  • సౌదీ, అబుదాబి నుంచి దిగుమతికి ఆసక్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 26: రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు డిస్కౌంట్లు కూడా భారీగా తగ్గడంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్ణయించింది. నవంబరులో ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాలని భావించినట్టు బీపీసీఎల్‌ ఫైనాన్స్‌ హెడ్‌ రామకృష్ణ గుప్తా సోమవారం వెల్లడించారు. రష్యా చమురుతో పోలిస్తే పశ్చిమాసియా దేశాల నుంచి ప్రస్తుతం ముడిచమురు మరింత చౌకగా, లాభదాయకంగా ఉండడం కూడా దీనికి ప్రధాన కారణని తెలిపారు. గత జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బీపీసీఎల్‌ తన మొత్తం అవసరాల్లో 37ు ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంది. అయితే.. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగాయి. దీనివల్ల రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం ఆర్థికంగా భారంగా మారింది. అక్టోబరు డెలివరీలకు రష్యా చమురు ప్రీమియం బ్యారెల్‌కు 12-13 డాలర్లు ఉండగా.. డిసెంబరు నాటికి అది 1-2 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని రామకృష్ణ గుప్తా తెలిపారు. కాబట్టి డిసెంబరులో కార్గో, రవాణా ఖర్చులు, బీమా, డిస్కౌంట్లను బట్టి రష్యా నుంచి మళ్లీ చమురు కొనుగోళ్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో సౌదీ అరేబియా, అబుదాబి వంటి పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలని బీపీసీఎల్‌ భావించినట్టు గుప్తా తెలిపారు. అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ ప్రాంతం నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేయాలని అంచనా వేసినట్టు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 05:04 AM