Share News

భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:27 PM

భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారంటూ పొరుగు దేశం పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటితో ఏడాది పూర్తయింది.

భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..
Rajnath Singh Pakistan warning

భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారంటూ పొరుగు దేశం పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటితో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో జర్మనీలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు (Rajnath Singh Pakistan warning).


'ఇప్పటివరకు భారత్ ఎవరిపై అయినా మొదటి సారి కావాలని దాడి చేయలేదు. పొరుగు దేశాలు భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే.. 'డాట్.. డాట్.. డాట్..' తీవ్ర స్థాయిలో ఉంటుంది. పొరుగు దేశాలన్నీ భారత్‌తో సఖ్యంగానే ఉన్నాయి. సమస్యలను సృష్టించాలని ప్రయత్నించేది ఆ ఒక్కటి మాత్రమే' అని పాక్ పేరును ప్రస్తావించకుండా రాజ్‌నాథ్ విమర్శలు గుప్పించారు (Pahalgam attack anniversary India).


ప్రస్తుతం భారత సైనిక వ్యవస్థ ఇంతకు ముందు కంటే చాలా దృఢంగా ఉందని, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగిందో తెలిసే ఉంటుంది కదా అని రాజ్‌నాథ్ అన్నారు (India Pakistan tension news). 'గతేడాది ఏప్రిల్ 22న కొందరు పిరికిపందలు చేసిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నా నివాళులు. వారి కుటుంబాల బాధను మేం ఎల్లప్పుడూ పంచుకుంటాం. జాతికి తగిలిన దెబ్బను ఎప్పటికీ మర్చిపోలేం' అని రాజ్‌నాథ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.


మరోవైపు పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల గురించి కూడా రాజ్‌నాథ్ మాట్లాడారు. ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ దేశాధినేతలతో ప్రధాని మోదీ మాట్లాడారని తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగి, పరిస్థితులు సద్దుమణగాలని ఆకాంక్షించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్..

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు

Updated Date - Apr 22 , 2026 | 05:35 PM