పహల్గాం ఘటన తర్వాత కీలక పరిణామం.. పాక్ ఉగ్రవాదులు-హమాస్ మధ్య బలపడిన బంధం..
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:42 PM
గతేడాది ఏప్రిల్‌లో జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం దాడులు చేసింది.
గతేడాది ఏప్రిల్‌లో జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం దాడులు చేసింది. కాగా, పహల్గాం ఘటన అనంతరం పాక్ ఉగ్రవాదులు, హమాస్ మధ్య సంబంధాలు బలపడినట్టు కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి (Pahalgam attack news).
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ అయిన హమాస్ నాయకులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలోని పలు ఉగ్రవాద గ్రూపులతో సమావేశం అయినట్టు తెలుస్తోంది. లష్కరే తొయ్యిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థల ప్రతినిధులతో హమాస్ నేతలు చర్చలు జరిపినట్లు కేంద్ర దర్యాప్తు బృందం బయటపెట్టింది. గతేడాది ఏప్రిల్ నుంచి హమాస్‌తో పాక్ ఉగ్ర బృందాలు నాలుగు సార్లు సమావేశమైనట్టు తెలుస్తోంది. పాక్ నగరాల్లోనూ, పీఓకేలోనూ, బంగ్లాదేశ్‌లోనూ ఈ సమావేశాలు జరిగినట్టు సమాచారం (Hamas Pakistan meetings).
గతేడాది జరిగిన పహల్గాం దాడి కూడా హమాస్ అమలు చేసే ప్రణాళికలు, శైలిలోనే జరిగినట్టు కేంద్ర దర్యాప్తు బృందం పేర్కొంది (Pakistan terror groups links). పాక్ ఉగ్రసంస్థలతో హమాస్ నేతల చర్చల అజెండా ఏమిటనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ఏజెన్సీలు.. నిఘా బృందాలను అప్రమత్తం చేశాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్..
ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు