Share News

ఐదు రాష్ట్రాల్లో 2.29 కోట్ల ఓట్లు ఫట్‌!

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:52 AM

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో 2.29 కోట్ల ఓట్లు తొలగించారు

ఐదు రాష్ట్రాల్లో   2.29 కోట్ల ఓట్లు ఫట్‌!
cash

  • యూపీ, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌

  • మణిపుర్‌లలో వచ్చే ఏడాదే ఎన్నికలు

  • యూపీలోనే 2.04 కోట్ల ఓట్లకు ఎసరు

న్యూఢిల్లీ, నవంబరు 2: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో 2.29 కోట్ల ఓట్లు తొలగించారు. వీటిలో ఉత్తరప్రదేశ్‌(యూపీ), ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంగా ఆయా రాష్ట్రాల్లోని ఓట్లలో 13.24 శాతం మేరకు కోతబడింది. ఈ మేరకు తాజాగా ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు జాబితాలను వెలువరించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో తగ్గిపోయిన ఓట్లలో ఒక్క యూపీ భాగమే 90 శాతం ఉండడం గమనార్హం. సర్‌ ప్రక్రియ చేపట్టక ముందు యూపీలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సర్‌ రెండో దశ తర్వాత 12.56 కోట్ల మంది ఓటర్లు మాత్రమే మిగిలారు. అయితే.. కొన్ని అభ్యంతరాలను పరిశీలించి కొత్తగా చేర్చిన తర్వాత మొత్తంగా 2.04 కోట్ల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. పంజాబ్‌లో సర్‌ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. సర్‌కు ముందు 2.15 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తర్వాత వీరి సంఖ్య 2.01 కోట్లుగా తేలింది. అంటే.. 14 లక్షల మంది ఓట్లను తొలగించారు. ఉత్తరాఖండ్‌లో 80లక్షల మంది ఓటర్లు ఉండగా.. మూడుదశల్లో చేపట్టిన సర్‌ తర్వాత వీరి సంఖ్య 72 లక్షలకు చేరింది. ఫలితంగా 8 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. మణిపుర్‌లో 20.9 లక్షల మంది ఓటర్లకు గాను మూడు దశల సర్‌ తర్వాత 19.6 లక్షల మంది మాత్రమే జాబితాల్లో చోటు సంపాయించుకున్నారు.


పంజాబ్‌లో చేపట్టిన సర్‌ ప్రక్రియలో 1.3 లక్షల మంది ఓటు హక్కును కోల్పోయారు. గోవాలో రెండు దశల్లో సర్‌ ప్రక్రియను చేపట్టగా 11.85 లక్షల మంది ఓటర్లకుగాను 10.58 లక్షల మంది ఓటర్లు మాత్రమే జాబితాల్లో చోటు సంపాయించుకున్నారు. ఇదిలావుంటే.. కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేందుకు ఆయా రాష్ట్రాల్లోని వారికి జనవరి 1వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 06:58 AM