Share News

Ooty: ఊటీ పార్క్‌లో రంగుల రోజాలు..

ABN , Publish Date - Jan 20 , 2026 | 10:33 AM

ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్‌ హౌస్‌లో రోజా మొక్కలు నాటారు.

Ooty: ఊటీ పార్క్‌లో రంగుల రోజాలు..

- ఏడాది పొడవునా వీక్షించే సదుపాయం

చెన్నై: ఊటీ రోజా పార్క్‌(Ooty Rose Park)లో, ఏడాది పొడవునా పర్యాటకులకు ఆహ్లాదం కలిగేలా, తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. నీలగిరి జిల్లా ఊటీలో దట్టమైన మంచు, వర్షం కారణంగా రోజా పార్క్‌లో మొక్కలు వాడిపోతుంటాయి. ఈ కారణంగా పార్క్‌కు వచ్చే పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్‌ హౌస్‌లో రోజా మొక్కలు నాటారు.


nani1.3.jpg

ఈ విషయమై ఉద్యానవన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఫైజల్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ బొటానికల్‌ పార్క్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా, గ్రీన్‌ హౌస్‌లో కొత్తగా తాజ్‌ మహల్‌ నెట్‌, అవలాన్స్‌ వైట్‌, గోల్డ్‌ స్ట్రిక్‌ మంజల్‌ తదితర ఐదు రకాలకు చెందిన 1,500 రోజా మొక్కలు నాటామన్నారు. ప్రస్తుతం ఈ మొక్కలకు పూలు వస్తున్నాయని, ఇక నుంచి రోజా పార్క్‌కు వచ్చే పర్యాటకులు ఏడాది పొడవునా రంగురంగుల రోజా పూలు తిలకించవచ్చని తెలిపారు.


nani1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 10:33 AM