ఒక్క ఓటు ఓటమిపై కోర్టుకు మాజీమంత్రి
ABN , Publish Date - May 11 , 2026 | 06:33 AM
ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన టీవీకే అభ్యర్థికి వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్...
చెన్నై, మే 10(ఆంధ్రజ్యోతి): ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన టీవీకే అభ్యర్థికి వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ జరిపింది. సోమవారం అఫిడివిట్ దాఖలుచేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు నోటీసు జారీచేసింది. శివగంగ జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్‌పై విజయం సాధించారు. అయితే, శివగంగ జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గంలో నమోదైన పోస్టల్ ఓట్లను వేలూరు సమీపంలో ఉన్న తిరుపత్తూర్‌కు తరలించారంటూ పెరియకరుప్పన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఓట్లను తాను పోటీ చేసిన నియోజకవర్గానికి చెందినవిగా పరిగణించి మళ్లీ లెక్కించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News