Share News

రెండో పెళ్లి చేసుకున్న జమ్మూకశ్మీర్ సీఎం

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:16 PM

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సరికొత్త వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన నిన్న (శుక్రవారం) పెళ్లి చేసుకున్నారు.

రెండో పెళ్లి చేసుకున్న జమ్మూకశ్మీర్ సీఎం

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సరికొత్త వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన నిన్న (శుక్రవారం) పెళ్లి చేసుకున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అబ్దుల్లా పంచుకున్నారు. ‘ఓ కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అంటూ వారి పెళ్లిఫోటోలు షేర్ చేశారు. కాగా ఇది ‘జమ్మూ’ సీఎంకు రెండో వివాహం. తొలి భార్యతో ఆయనకు విడాకులు మంజూరు చేయడానికి కోర్టు ఇటీవలే అంగీకరించింది.


ఒమర్ అబ్దుల్లాకు పాయల్ అబ్దుల్లాతో 1994లో వివాహమైంది. వైవాహిక జీవితంలో పలు వివాదాలు రావడంతో వీరు 2011లో విడిపోయారు. తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీన్ని ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో సవాలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. విడాకులు మంజూరు చేయడానికి ఈ ఏడాది జూలై 31న అంగీకరించింది. దీంతో జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ‘జమ్మూ’ సీఎం ద్వితీయ వివాహం చేసుకున్నారు.


ఈ వార్తలూ చదవండి

పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయి.. సర్‌పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Oct 31 , 2026 | 07:25 PM