Share News

పామును ఆడిస్తున్నట్లుగా మోదీ కార్టూన్‌!

ABN , Publish Date - May 21 , 2026 | 05:50 AM

ప్రధాని నరేంద్ర మోదీపై నార్వే మీడియా తన అహంకారపూరిత ధోరణిని ప్రదర్శిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న...

పామును ఆడిస్తున్నట్లుగా మోదీ కార్టూన్‌!

నార్వే మీడియాది జాత్యాహంకారమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు

న్యూఢిల్లీ, మే 20: ప్రధాని నరేంద్ర మోదీపై నార్వే మీడియా తన అహంకారపూరిత ధోరణిని ప్రదర్శిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారన్న విషయం ఇప్పటికే చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక వార్తా పత్రిక మోదీని పామును ఆడించే వ్యక్తిగా అభివర్ణిస్తూ కార్టూన్‌ను ప్రచురించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నార్వే మీడియా జాత్యాహంకార ధోరణికి నిదర్శనమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బుట్టలో నుంచి పైకి లేచిన పెట్రోల్‌ గన్‌ రూపంలోని పామును బూర ఊదుతూ ఆడిస్తున్న మోదీ కార్టూన్‌ను సదరు పత్రిక ప్రచురించింది. దానికి ‘తెలివైన, చికాకు పెట్టే వ్యక్తి’ అంటూ కాప్షన్‌ పెట్టింది. ఈ కార్టూన్‌పై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా జాత్యాహంకార ధోరణిని ప్రతిబింబిస్తోందని, భారత్‌ను పాములు పట్టేవాళ్ల దేశంగా పేర్కొంటూ అవమానిస్తున్నారని సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమల నుంచి బయటపడలేక పోతున్నా’రంటూ ఒక నెటిజన్‌ ఎక్స్‌ సందేశంలో ఆగ్రహం ప్రదర్శించారు. ‘పాశ్చాత్య మీడియాలో వలసవాద అహంకారం ఇంకా కొనసాగుతుంద’ని ఇంకొకరు మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:50 AM