Share News

పెట్రోల్, డీజిల్ పెంపు ఆలోచన లేదు.. కేంద్రం

ABN , Publish Date - Apr 28 , 2026 | 09:15 PM

పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఇది శుభవార్త. పశ్చిమబెంగాల్ పోలింగ్ ఈనెల 29న పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను కేంద్రం కొట్టివేసింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ పెంపు ఆలోచన లేదు.. కేంద్రం
petrol pumps

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఇది శుభవార్త. పశ్చిమబెంగాల్ పోలింగ్ ఈనెల 29న పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను కేంద్రం కొట్టివేసింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో గత రెండు నెలలుగా క్రూడాయిల్ ధరలు 50 శాతం పెరిగాయి. అయినప్పటికే రికార్డు స్థాయిలో గత నాలుగేళ్లుగా రిటైల్ పెట్రోల్, డిజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.


పశ్చిమాసియాలో తలెత్తిన ఘర్షణల కారణంగా చమురు ఉత్పత్తి ధరలు, పంప్ ధరల మధ్య వ్యత్యాసం పెరగింది. దీంతో ఇంధనం రిటైలర్లు ప్రతిరోజూ రూ.2,400 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనివార్యమని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


దీనిపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మాట్లాడుతూ, పెట్రోలో, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 'ప్యానిక్ బైయింగ్' జరుగుతున్నట్టు తెలుస్తోందని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని, రిటైల్ ఔట్‌లెట్స్‌‌ను మానిటర్ చేస్తున్నామని, అవసరమైన సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, స్టాక్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని, ఎలాంటి డ్రైఔట్‌లు లేవని చెప్పారు. 'తగినన్ని ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాలు మావద్ద ఉన్నయి. ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. రేట్లలో ఎలాంటి పెరుగుదల లేదు' అని వివరించారు. వదంతులు నమ్మవద్దని కోరారు.


ఇవి కూడా చదవండి..

రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ

Updated Date - Apr 28 , 2026 | 09:37 PM