ఏదైనా మనసు పెట్టి చేయండి.. ఇంటర్న్‌లకు నిర్మలా సీతారామన్ సూచన
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:50 PM
ఏ పని చేసినా ఎంతో జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలని యువ ఇంటర్న్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద ఇంటర్న్‌షిప్ చేస్తున్న యువతతో న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ తాజాగా సమావేశమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ పని చేసినా ఎంతో జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలని యువ ఇంటర్న్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద ఇంటర్న్‌షిప్ చేస్తున్న యువతతో న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పని పట్ల బాధ్యత, నిబద్ధత, కచ్చితత్వం ఎంత ముఖ్యమో వివరించారు (Nirmala Sitharaman interns).
'మీరు ఏ పని చేస్తున్నా జాగ్రత్తగా చేయండి. దాన్ని అత్యంత కచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటు తర్వాత మరొక వ్యక్తికి తీవ్ర పరిణామాలను కలిగించవచ్చు' అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక వాహనంలోని చిన్న భాగాన్ని తయారు చేసే సమయంలో జరిగిన పొరపాటు చివరకు ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిపై ప్రభావం చూపవచ్చని అన్నారు. అది ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చని, లేదా మరమ్మతుల కోసం వినియోగదారుడు నిరంతరం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చని వివరించారు (Internship scheme India).
బ్యాంకింగ్ రంగంలో పొరపాటున రూ.1,000 బదులు రూ.1 లక్ష బదిలీ చేస్తే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని ఆమె ప్రశ్నించారు (Industry skills). అదేవిధంగా డిజిటల్ సమాచారాన్ని నిర్వహించే సమయంలో ఒక వ్యక్తి పేరు, ఖాతా లేదా ఇతర వివరాల్లో చిన్న తప్పు జరిగినా ఆ వ్యక్తికి కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. బాధ్యతలు నిర్వర్తించే సమయంలో తమ పని వల్ల ప్రయోజనం పొందే వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..