Share News

20 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. నింబాల్కర్ హత్య కేసులో మాజీ మంత్రికి విముక్తి..

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:58 PM

రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

20 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. నింబాల్కర్ హత్య కేసులో మాజీ మంత్రికి విముక్తి..
Padamsinh Patil

రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో 128 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది (Nimbalkar Case).


2006 జూన్ 3న కాంగ్రెస్ నేత పావన్‌రాజే నింబాల్కర్ తన డ్రైవర్ సమద్ అబ్దుల్ వాహిద్ కాజీతో కలిసి ప్రయాణిస్తుండగా నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నింబాల్కర్, ఆయన డ్రైవర్ మరణించారు. ఈ హత్యలకు రాజకీయ శత్రుత్వమే కారణమని దర్యాప్తు సంస్థలు అప్పట్లో వెల్లడించాయి. నింబాల్కర్‌ను రాజకీయంగా తొలగించేందుకు పద్మసింహ్ పాటిల్ కుట్ర పన్నారని, దానికి పలువురు సహకరించారని సీబీఐ పేర్కొంది (Padamsinh Patil Acquitted).


దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది (Maharashtra Politics). నిందితులపై అభియోగాలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని ప్రత్యేక సీబీఐ కోర్టు పేర్కొంది. దీంతో పద్మసింహ్ పాటిల్ సహా మిగతా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..


ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..

Updated Date - Jun 20 , 2026 | 05:02 PM