పాక్ కుట్ర..సయీద్ నేతృత్వం
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:03 AM
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్‌ఐఏ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. పాకిస్థాన్ రచించిన కుట్రను, లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ అమలుచేశారని...
పహల్గామ్ దాడిపై ఎన్‌ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ, జూలై 6: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్‌ఐఏ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. పాకిస్థాన్ రచించిన కుట్రను, లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ అమలుచేశారని పేర్కొంది. సయీద్‌ను ఈ కేసులో నిందితునిగా చేర్చింది. ఆ రెండు సంస్థల అధినేతగానే కాకుండా, వ్యక్తిగతంగానూ సయీద్‌ను ఈ కేసులో ఎన్‌ఐఏ భాగం చేసింది. బీఎన్‌ఎస్, ‘ఉపా’ తదితర చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై అభియోగాలు మోపింది. భారత్‌పై యుద్ధానికి తెగబడటంతోపాటు, సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాద కుట్రలకు సయీద్ పాల్పడుతున్నాడని జమ్మూ ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన 1,597 పేజీల చార్జిషీట్‌లో పేర్కొంది. ఎన్‌ఐఏ 2025 డిసెంబరు 15న దాఖలుచేసిన చార్జిషీట్‌లో ఆరుగురు ఉగ్రవాదులను నిందితులుగా చేర్చింది. ఇప్పుడు వేసిన అనుబంధ అభియోగపత్రంలో సయీద్‌ను చేర్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News