Mumbai: ప్రియుడిని ఇంటికి పిలిచిన ప్రియురాలు.. షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:44 PM
అతనికి భార్య.. ఆమెకు భర్త ఉన్నారు.. పిల్లలు కూడా ఉన్నారు.. అయినా ఇద్దరూ అఫైర్ నడుపుతున్నారు.. అదీ చాలదన్నట్లు కట్టుకున్న భార్యను వదిలేసి రా.. పెళ్లి చేసుకొందామని డిమాండ్ చేసిందామె. వొద్దని అతను వాదించాడు. దూరం పెట్టాడు. దీంతో రివేంజ్ తీసుకోవాలని భావించిన సదరు మహిళ ఏం చేసిందంటే..
ముంబై, జనవరి 2: నగరంలోని ఈస్ట్ శాంటాక్రజ్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్‌ను కట్ చేసింది. న్యూఇయర్ రోజున చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మరి ఆ మహిళ ఎందుకు అంతటి అఘాయిత్యానికి పాల్పడింది..? అసలేం జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది న్యూఇయర్ సెలబ్రేషన్స్ తమకు ఇష్టమైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఆ మహిళ కూడా తన ఇష్టమైన వ్యక్తితో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ఇంకేముంది.. తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ప్రేయసి పిలవడంతో రయ్‌మంటూ వెళ్లాడు ఆ ప్రియుడు. అక్కడి వెళ్లాక.. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇదే సమయంలో ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లారు. అసలు ట్విస్ట్ ఇప్పుడే చోటు చేసుకుంది. ప్రియుడి కళ్లకు గంతలు కట్టిన ప్రేయసి.. ప్యాంట్ విప్పాలని కోరింది. అతను అలాగే చేశాడు. ఇంతలో ఆ మహిళ వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి అతని ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యింది. మహిళ చర్యతో దీంతో ఖంగుతిన్న అతను.. లబోదిబోమంటూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మహిళను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
అసలు ట్విస్ట్ ఇదే..
ఆమె వయసు 25.. అతని వయసు 44.. ఇద్దరికీ పెళ్లైంది. వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. పైగా వీరు బంధువులు కూడా. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాహేతరం సంబంధం మొదలైంది. ఆరు సంవత్సరాలుగా వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఆ బంధం మరింత బలపడింది. అతనిపై ఆమె వ్యామోహం మరింత పెరిగింది. దొంగచాటు వ్యవహారాలొద్దు.. ఇక నేరుగా పెళ్లి చేసుకుందాం అంటూ అతనితో చెప్పేసింది. ఇక ఇప్పుడు మొదలైంది అసలు కథ. ఆమె పెళ్లి ఊసెత్తడంతో.. ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరూ పెళ్లైన వారు.. పిల్లలు కూడా ఉన్నారు.. మళ్లీ పెళ్లి అంటే ససెమిరా అన్నాడతను. కానీ, ఆమె మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందేనని, కట్టుకున్న భార్యను విడిచిపెట్టి తన వద్దకు రావాల్సిందేనంటూ పట్టుపట్టింది. ఈ క్రమంలో గత నవంబర్ నెలలో బాధిత వ్యక్తి ఉపాధి కోసం బిహార్‌కు వెళ్లాడు. అయినా ఆమె వదల్లేదు. వరుసబెట్టి ఫోన్ కాల్స్ చేసి.. పెళ్లి చేసుకుందామంటూ కోరింది. డిసెంబర్ 19వ తేదీన అతను తిరిగి ముంబైకి వచ్చాడు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన అతను.. ఆమెను పూర్తిగా దూరం పెట్టాడు. దీంతో రగిలిపోయిన ఆమె.. అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించింది. తనకు దక్కని వాడు.. ఎవరికీ దక్కొద్దని భావించింది. డిసెంబర్ 31న అర్థరాత్రి 1:30 గంటలకు కేక్ కటింగ్ పేరుతో అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు.. పిల్లలు నిద్రపోతున్నారు. ఆమె ఆహ్వానం మేరకు ప్రియుడికి ఇంటికి వచ్చేశాడు. కేక్ కట్ చేశారు. ఆ తరువాత ఆమె ప్లాన్ ప్రకారం అతని ప్రైవేట్‌పార్ట్‌ను కట్ చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read:
Baloch leader writes to Jaishankar: భారత్ భద్రతకు ముప్పు.. జైశంకర్‌కు బలోచ్ నేత సంచలన లేఖ
Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు
Sleep Problems in Women: ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.!