Share News

Sleep Problems in Women: ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.!

ABN , Publish Date - Jan 02 , 2026 | 08:05 PM

చాలా మంది మహిళలు సాధారణంగా వివిధ కారణాల వల్ల నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే, ఆరోగ్య నిపుణులు ఇచ్చిన కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

 Sleep Problems in Women: ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.!
Sleep Problems in Women

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మహిళలు రోజూ ఇంటి పనులన్నీ పూర్తిచేస్తారు. కానీ పని పూర్తయిన తర్వాత కూడా వారి మనస్సు ప్రశాంతంగా ఉండదు. రోజంతా చేసిన పనులు, రేపు చేయాల్సిన పనులు ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో తిరుగుతుంటాయి. ఈ కారణంగా చాలామంది మహిళలకు రాత్రి సరిగా నిద్ర పట్టదు.


ఇలా చేయండి

రోజువారీ పనులు పూర్తయ్యాక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఆ రోజు ఏమి జరిగిందో ఆలోచించండి. రేపు చేయాల్సిన పనులను ఒక నోట్ చేసుకోండి. ఇలా చేస్తే మనస్సు తేలికపడుతుంది. నిద్ర సులభంగా వస్తుంది.

షెడ్యూల్ ఉండాలి

ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో మేల్కోవడం చాలా ముఖ్యం. వారాంతాల్లో కూడా ఈ అలవాటు మార్చకూడదు. ఇలా చేస్తే శరీరంలోని జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. నిద్ర సమస్య తగ్గుతుంది.

ఒత్తిడిని తగ్గించండి

పని, కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడి రావడం సహజం. కానీ పడుకునే ముందు చింతించడం మానుకోవాలి. లోతైన శ్వాస, ధ్యానం, కాసేపు వాకింగ్ చేయడం వంటివి చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.


సూర్యరశ్మి అవసరం

ఉదయం 15–30 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీరానికి పగలు అని సంకేతం వెళ్తుంది. దీని వల్ల రాత్రి నిద్ర బాగా వస్తుంది. మొబైల్, టీవీ వంటి డిజిటల్ స్క్రీన్‌లను రాత్రి ఎక్కువసేపు చూడకపోవడం మంచిది.

వ్యాయామం చేయండి

పగటిపూట చురుకుగా ఉండేందుకు వ్యాయామం చాలా అవసరం. నడక, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. కానీ నిద్రకు ముందు వ్యాయామం చేయకూడదు, అది నిద్రకు అడ్డంకి అవుతుంది.

పడకగదిని సరిగా ఉంచండి

మంచం మీద పనికి సంబంధించిన వస్తువులు, ల్యాప్‌టాప్, బొమ్మలు పెట్టకండి. బెడ్‌రూమ్ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. మసక లైట్లు, చల్లని వాతావరణం నిద్రకు సహాయపడతాయి.


ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మహిళలు తరచూ నిద్రను త్యాగం చేస్తారు, కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, పనులతో పాటు నిద్రకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. మంచి నిద్రతో ఆరోగ్యంగా ఉండండి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే

జనవరి నెలలో ఈ అందమైన లోయలను తప్పక చూడండి

For More Latest News

Updated Date - Jan 02 , 2026 | 08:09 PM