Winter Travel Destinations: జనవరి నెలలో ఈ అందమైన లోయలను తప్పక చూడండి
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:28 PM
శీతాకాలంలో మంచును ఆస్వాదించాలనుకుంటే, భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. జనవరి నెలలో ఈ ప్రదేశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో శీతాకాలం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా, హిమాలయాల్లోని శిఖరాలు మంచుతో కప్పబడి అవి అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. ఈ శీతాకాలంలో మంచును ఆస్వాదించాలనుకుంటే, భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుల్మార్గ్
గుల్మార్గ్ (Gulmarg) అనేది జమ్మూ & కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక హిల్ స్టేషన్. ఇది శీతాకాలంలో స్కీయింగ్, స్నోబోర్డింగ్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన గోల్ఫ్ కోర్స్, గొండోలా కేబుల్ కార్ వంటి ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి.

ఔలి
ఔలి (Auli) అనేది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్వత ప్రాంతం, స్కీయింగ్ కేంద్రం. దీనిని భారతదేశపు స్కీ రాజధాని అని కూడా అంటారు. ఇది హిమాలయాల నడిబొడ్డున 2,500 నుండి 3,050 మీటర్ల ఎత్తులో ఉంది. శీతాకాలంలో మంచుతో కప్పబడి స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి వాటికి అనువుగా ఉంటుంది.
లచుంగ్ యుమ్తాంగ్ లోయ
సిక్కింలోని ఉత్తర భాగంలో ఉన్న లచుంగ్ యుమ్తాంగ్ లోయ ఒక సుందరమైన పూల లోయ (Valley of Flowers). ఇది చుట్టూ మంచుతో కప్పబడిన శిఖరాలతో, పచ్చిక బయళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా వసంతకాలంలో రంగురంగుల పూలతో నిండిపోతుంది.

పహల్గామ్
జమ్మూ & కాశ్మీర్ లోని పహల్గామ్ కుల్మార్క్ కంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మంచుతో కప్పబడిన లోయలు, పైన్ అడవుల ప్రకృతి మనసును హత్తుకుంటుంది. అమర్‌నాథ్ యాత్రకు ముఖ్యమైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. హిమాలయాల్లోని పచ్చని పర్యావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కుఫ్రీ
కుఫ్రీ (Kufri) అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్, మంచుతో కప్పబడిన దృశ్యాలు, ప్రకృతి అందాలు, సాహస క్రీడలకు ఇది ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శీతాకాలంలో స్కీయింగ్, ట్యూబ్ రైడింగ్, స్నో కింగ్‌డమ్‌లో ఐస్ స్కేటింగ్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. మహాసు శిఖరం (Mahasu Peak) ఇక్కడి ఎత్తైన ప్రదేశం. అందువల్ల జనవరి నెలలో ఈ అందమైన లోయలను మీరు తప్పక చూడండి.. ఇవి మీ మనసుకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాయి.
Also Read:
ఈ విషయాలను బంధువులతో అస్సలు పంచుకోకండి..
చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
For More Lifestyle News