నీట్ పేపర్ లీక్ ఎలా జరిగింది.. విద్యార్థుల వరకు ప్రశ్నపత్రం ఎలా చేరిందంటే..
ABN , Publish Date - May 17 , 2026 | 04:40 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలోనే ఉన్న 'ఇన్‌సైడర్లు' ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసి, మధ్యవర్తుల ద్వారా దేశంలోని పలుచోట్ల విద్యార్థులకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలోనే ఉన్న 'ఇన్‌సైడర్లు' ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసి, మధ్యవర్తుల ద్వారా దేశంలోని పలుచోట్ల విద్యార్థులకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఎన్‌టీఏ నియమించిన నిపుణులు కొందరు ఈ లీకేజ్ వెనుక కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది (NEET UG 2026 paper leak).
పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా మందారే, కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణి పేర్లు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరు పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ముందుగానే సేకరించి బయటకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. పరీక్ష ప్రశ్నపత్రాన్ని మొదట చేతితో రాసి, తర్వాత స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో పంపినట్లు విచారణలో వెల్లడైంది. 'గెస్ పేపర్' పేరుతో సుమారు 400 ప్రశ్నల సెట్‌ను విద్యార్థులకు అందించారు. అందులో అసలు పరీక్షలో వచ్చిన బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు (NEET insider leak).
ఈ ప్రశ్నపత్రాలను అందించేందుకు భారీ మొత్తాలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో మధ్యవర్తి నుంచి రూ.10-25 లక్షల వరకు వసూలు చేసినట్టు సీబీఐ గుర్తించింది. రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, కేరళం వంటి రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు. పుణె నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రశ్నపత్రం లీక్ కావడంలో శుభమ్ ఖైర్నార్ కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది (CBI NEET investigation).
ఖైర్నార్ ఆ ప్రశ్నపత్రాన్ని యశ్ యాదవ్ అనే నిందితుడికి అందించారు (NEET exam malpractice). యశ్ యాదవ్ ఏప్రిల్ 29న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నపత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో టెలిగ్రామ్ ద్వారా వేరేవారికి పంపారు. ప్రశ్నపత్రాలు పంపిణీ కోసం నిందితులు సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూపులు, కోచింగ్ సెంటర్లను ఉపయోగించుకున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు తల్లిదండ్రులు కూడా మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఆర్థిక లావాదేవీలు, కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..
మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..