మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..
ABN , Publish Date - May 17 , 2026 | 03:07 PM
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత వినోదానికి ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత వినోదానికి ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. తన ప్రేయసి అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి లగ్జరీ ట్రిప్‌లు, ఖరీదైన సంగీత కార్యక్రమాలకు హాజరైనట్లు వచ్చిన కథనాలు అమెరికాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి (Kash Patel controversy).
గతేడాది కాశ్ పటేల్ తన ప్రియురాలితో కలిసి వెళ్లిన లగ్జరీ డేట్‌కు సంబంధించిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎఫ్‌బీఐకి చెందిన జెట్‌ను ఉపయోగించి గతేడాది మే నెలలో ఆయన తన ప్రేయసి అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ కాన్సర్ట్‌కు వెళ్లారు. అక్కడ 50 వేల డాలర్లు (దాదాపు రూ.47 లక్షలు) వెచ్చించి ఓ సూట్‌ను అద్దెకు తీసుకుని అందులో నుంచి కాన్సర్ట్‌ను వీక్షించారు (FBI jet controversy).
కాశ్ పటేల్, విల్కిన్స్ ఆ కాన్సర్ట్ నుంచి తిరిగి వెళ్లేవరకు విమాన, భద్రతా సిబ్బంది అదనపు గంటలు పని చేయాల్సి వచ్చింది (Kash Patel girlfriend Alexis Wilkins). అందుకోసం వారికి అదనంగా జీతం కూడా చెల్లించారట. ఈ విషయాలు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాగా, కాన్సర్ట్‌ను వీక్షించడం కోసం బుక్ చేసుకున్న లగ్జరీ సూట్‌కు డబ్బులు ఎవరు చెల్లించారనే ప్రశ్నకు సమాధానమివ్వడానికి కాశ్ పటేల్ నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
నీట్ పేపర్ లీక్.. 14 రోజుల సీబీఐ కస్టడీకి నిందితురాలు