Share News

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..

ABN , Publish Date - May 17 , 2026 | 03:24 PM

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరాల పాటు సామూహిక అత్యాచారం, బెదిరింపులు ఎదుర్కొన్న ఇద్దరు సోదరీమణులు రెండు నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..
Jodhpur Crime News

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరాల పాటు సామూహిక అత్యాచారం, బెదిరింపులు ఎదుర్కొన్న ఇద్దరు సోదరీమణులు రెండు నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి (Jodhpur Crime News).


జోధ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి స్నానం చేస్తున్నప్పుడు స్థానిక ఈ-మిత్ర సేవా కేంద్రం నిర్వాహకుడు వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్నాడు. అనంతరం మరో ఏడుగురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు నాలుగేళ్ల పాటు వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. డబ్బులు కూడా తీసుకున్నారు (Jodhpur sisters died).


వారి వేధింపులు భరించలేక బాధిత మహిళ ఈ ఏడాది మార్చి 20న ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత బాధిత మహిళ సోదరిపై నిందితులు బెదిరింపులకు దిగారు. అక్క వీడియోలను బయటపెడతామని బెదిరిస్తూ తనపై కూడా అత్యాచారాలు కొనసాగించారని ఆమె ఆరోపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేనప్పటికీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదు (Jodhpur horror case).


న్యాయం కోసం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో సోదరి తీవ్ర నిరాశకు గురైంది. శుక్రవారం ఆమె నీటి ట్యాంక్‌ పైకి ఎక్కి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఇద్దరు యువతుల ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు (Rajasthan police negligence).


ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కేసులో పోలీసుల వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కూడా చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

నీట్ పేపర్ లీక్.. 14 రోజుల సీబీఐ కస్టడీకి నిందితురాలు

Updated Date - May 17 , 2026 | 05:53 PM