త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - May 17 , 2026 | 03:46 PM
తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ట్రైన్ నంబర్ 12431లోని B-1 ఏసీ కోచ్‌లో ఆదివారం ఉదయం సుమారు 5:15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ట్రైన్ నంబర్ 12431లోని B-1 ఏసీ కోచ్‌లో ఆదివారం ఉదయం సుమారు 5:15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కోచ్‌లో సుమారు 68 మంది ప్రయాణికులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు భావిస్తున్నారు (Rajdhani Express fire).
కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గమనించిన గార్డ్ వెంటనే లోకో పైలెట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ చర్యలు చేపట్టి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు (Delhi Thiruvananthapuram Rajdhani fire).
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, అసలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది (AC coach fire Rajdhani Express). ఈ ఘటనతో ముంబై-ఢిల్లీ ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రైళ్లను ఆలస్యంగా నడపడంతో పాటు కొన్నింటి రూట్లను మార్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..
మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..